Google Maps: కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ
నవీ ముంబైలో ఓ మహిళ గూగుల్ మ్యాప్ చూపించిన షార్ట్కట్ దారిని ఫాలో అవుతూ, ఆమె కారు నీటి గుంతలో పడిపోయింది. బేలాపూర్ వంతెన దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా, మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను రక్షించారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.