VIRAL VIDEO: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది.. బ్రిడ్జ్‌పై నుంచి పడిపోయిన కారు

ఇండోనేషియాలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్‌మ్యాప్ చూస్తూ వెళ్లిన ఓ జంటకారు ప్రమాదానికి గురైంది. ఫ్లైఓవర్‌పై నుంచి స్పీడ్‌గా వెళ్తుండగా మధ్యలో కిందికి పడిపోయింది. ఆ బ్రిడ్జ్ నిర్మాణం సగంలోనే ఆగిపోవడంతో మ్యాప్‌లో చూపించలేదు. దీంతో ప్రమాదబారిన పడ్డారు.

New Update
Google Maps Error Leads to Near Tragedy on Unfinished Bridge in Indonesia

Google Maps Error Leads to Near Tragedy on Unfinished Bridge in Indonesia

సాధారణంగా ఒకప్పుడు ఎలా ఉంటేదంటే.. మనం ఏదైనా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లినపుడు చాలా కంగారు పడుతుండేవాళ్లం. సరైన దారులు తెలియక సతమతం అవుతుండేవాళ్లం. దారి పొడువునా కనిపించిన వారిని అడ్రస్ అడుగుతూ గమ్యాన్ని చేరుకునే వాళ్లం. ఇలాంటి జర్నీ ప్రతి ఒక్కరికి ఎదురైయ్యే ఉంటుంది. తెల్లవారి బయల్దేరితే.. గమ్యానికి చేరుకోవడానికి మధ్యాహ్నం పట్టేది.  

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నాం. చేతిలో మొబైల్ ఫోన్‌ ఉంటే చాలా ప్రపంచాన్నే చుట్టేస్తున్నాం. వేరొకరి సహాయం లేకుండానే దేశ దేశాలు తిరిగేస్తున్నాం. వీటన్నీంటికి గూగుల్ మ్యాప్ చాలా కీలకమైంది.  వీటి ద్వారానే ఎన్నో కోట్లమంది ప్రజలు తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు, దేశాలు దాటి దేశాలకు ప్రయాణాలు చేస్తున్నారు. 

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

అయితే గూగుల్ మ్యాప్‌ను నమ్మడం ముఖ్యమే.. కానీ గుడ్డిగా నమ్మకూడదు. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మడం వల్ల కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు బారిన పడాల్సి వస్తోంది. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఎంతోమంది వ్యక్తులు నదులు లేదా అడవుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా యాప్‌పై మాత్రమే ఆధారపడి సగం నిర్మించిన రోడ్లపై వాహనం నడుపుతూ ప్రాణాలు కోల్పోయినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. 

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

ఫైఓవర్ నుంచి కింద పడి

తాజాగా అలాంటిదే మరొక ఘటన జరిగింది. ఇండోనేషియాలో ఒక జంట గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి తమ మార్గాన్ని నావిగేట్ చేశారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వారి BMW కారు ఒక ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. అలా ముందుకు వెళ్తుండగా.. వాహనం స్పీడ్‌గా వెళ్లి అకాస్మాత్తుగా కిందికి పడిపోయింది. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తిగా కంప్లీట్ కాకపోవడం వల్ల కారు స్పీడ్‌గా వెళ్లి కిందున్న రోడ్డుపైకి దూకింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

viral-news | viral-video | latest-telugu-news | telugu-news | google-maps

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు