Google Maps: గుడ్డిగా గూగుల్‌ని నమ్మిన ఫ్యామిలీ.. చివరికి ఏం జరిగిందంటే?

హిమాచల్ ప్రదేశ్‌‌ నలగఢ్‌కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్‌లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.

New Update
car whit google map

గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా నమ్మి ఓ ఫ్యామిలీ గంగ పాలైంది. హిమాచల్ ప్రదేశ్‌‌లోని సోలన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నలగఢ్‌కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె పరీక్ష కోసం ఉనాకు కారులో ప్రయాణిస్తోంది. వారు ప్రధాన రహదారిలో ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్‌లో వెళ్లారు. అయితే రెండు సంవత్సరాల క్రితం వరదల కారణంగా ఆ వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. ఆ విషయాన్ని గుర్తించని గూగుల్ మ్యాప్స్‌ అదే రూట్ సూచించింది. దీంతో వారి కారులో ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.

ఆ నదిలో కొన్ని కిలోమీటర్ల దూరం కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ స్థానికులు వారిని గమనించి కాపాడారు. ఆ కారులోని నలుగురిని రక్షించారు. ఆ గ్రామ ప్రజలు ఆ వంతెన గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వంతెనను బాగు చేయాలని కోరుతున్నారు. ఇంతకు ముందు కూడా పలువురు గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి ఆ వంతెన దగ్గర ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. బ్రిడ్జ్ బాగు చేయడమో లేదా సైన్ బోర్డ్‌లనైనా పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు