Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు
ఒడిశాలోని కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరికి పోలీసులు వాళ్లని రక్షించగలిగారు.