Rajmargyatra : గూగుల్ మ్యాప్‌నే తలదన్నే.. కొత్త యాప్ మీకు తెలుసా?

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాజ్‌మార్గ్‌యాత్ర అనే కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు రెస్టారెంట్లు, ఫాస్టాగ్ సర్వీసులు, పర్యాటక ప్రదేశాలు, టోల్ ప్లాజా వివరాలు, ఫిర్యాదులు అన్నింటిని కూడా ఇందులో చేసుకోవచ్చు.

New Update
Rajmargyatra

కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ ఏదైనా వాహనంలో ప్రయాణిస్తారు. మళ్లీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడనికి మరో యాప్ యూజ్ చేస్తుంటారు. ఇలా మ్యాప్‌కి ఒకటి, రీఛార్జ్‌కి వేరే యాప్ కాకుండా అన్నింటికి ఒకటే యాప్ కావాలని అనుకుంటారు. అలాంటి వారికోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాజ్‌మార్గ్‌యాత్ర పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రూట్‌ మ్యాప్స్‌ నుంచి స్మార్ట్‌ అలర్ట్స్‌ వరకు అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్‌కి థీటుగా ఈ రాజ్‌మార్గ్‌యాత్ర ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్!

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు రెస్టారెంట్లు, పెట్రోల్‌ పంపులు, ఆసుపత్రులు, ఛార్జింగ్‌ స్టేషన్లు, ఏటీఎంలు, పోలీస్‌ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఇలా మొత్తం సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆఖరికి వాతావరణ, ట్రాఫిక్‌ అలర్టులు కూడా తెలుస్తాయి.  అలాతే ప్రధాన రహదారుల్లో సమస్యలు వస్తే ఫిర్యాదు కూడా చేయవచ్చు. Report An Issue On NH అనే ఆప్షన్‌ క్లిక్ చేసి ఫొటో, వీడియోను యాడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ వెంటనే చర్యలు తీసుకుంటుంది. మీరు కూడా ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Phone pe: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త!

మీరు ప్రయాణించే ముందు Toll Plaza Enroute అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి ప్లేస్, చేరాల్సిన ప్రదేశం ఎంటర్‌ చేయాలి. ఆ లైన్‌లో ఉండే టోల్‌ ప్లాజాలు రావడంతో పాటు కట్టాల్సిన డబ్బులు ఫుల్ డిటైల్స్ కనిపిస్తాయి. కొందరు స్పీడ్‌గా వెళ్తుంటే.. ఓవర్ స్పీడ్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. పరిమితికి మించి మీరు వేగంగా ప్రయాణిస్తే అలర్ట్ చేస్తుంది. అయితే ప్రొఫైల్లోకి వెళ్లి స్మార్ట్ అలర్ట్‌, వాయిస్‌ అసిస్టెంట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్‌హెచ్‌ఏఐ ఈ సదుపాయం తీసుకొచ్చింది. 

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మరో రెండు రోజులు సెలవులు!

ఇవే కాకుండా ఫాస్టాగ్ సర్వీసులు హైవే అసిస్టెన్స్‌, పోలీస్‌ అసిస్టెన్స్‌, ఎమర్జెన్సీ నంబర్లు ఎమర్జెన్సీ ఆప్షన్‌లో కనిపిస్తాయి. అలాగే ప్రయాణిస్తున్న హైవే వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ యాప్‌.. తెలుగు, ఇంగ్లిష్‌తో పాటు మొత్తం 12 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. దీనిని గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్ ప్లే సోర్ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యి వినియోగించవచ్చు.

ఇది కూడా చూడండి: T20 Womens World Cup : పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి

Advertisment
Advertisment
తాజా కథనాలు