/rtv/media/media_files/2025/08/27/car-misled-by-google-maps-2025-08-27-17-02-19.jpg)
Car Misled By Google Maps
చాలామంది ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌ను వినియోగిస్తారు. కొన్నిసార్లు అవి తప్పుడు మార్గాలను కూడా సూచిస్తాయి. దీనివల్ల పలు వాహనాలు నదులు, కాలువలు, చెరువులోకి వెళ్లి ప్రమాదాలకు గురైన ఘటనలు చాలానే ఉన్నాయి. జీపీఎస్ కనెక్టివిటీ, టెక్నికల్ లోపం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటే ఘటనే రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నఖేడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం భిల్వారాలోని సవాయిభోజ్‌కు వెళ్లింది. అక్కడ గడిపాక రాత్రి తిరిగి వచ్చేటప్పుడు కారులో గూగుల్ మ్యాప్స్ వాడారు. దాన్ని అనుసరించిన కారు బనాస్ నదిపై ఉన్న సోమిఉప్రెడా కల్వర్ట్ పైకి వెళ్లింది. ప్రమాదవశాత్తు అక్కడున్న గోయ్యిలో పడింది. ఆ తర్వాత నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదం రాత్రి జరగడంతో అక్కడి స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు.
చివరికి కొంత సమయం తర్వాత నీటిలో చిక్కుకున్న ఆ కుటుంబ సభ్యులు కేకలు వేశారు. ఇది విన్న స్థానికులు అయిదుగురిని రక్షించారు. మరో నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. వాళ్లలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నారు.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
వాస్తవానికి మంగళవారం రాత్రిపూట మాతృ-కుండియా అనే ఆనకట్ట గేట్లు తెరిచారు. దీంతో బనాస్ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఆ కుటుంబ సభ్యుల్లో నలుగురు గల్లంతయ్యారు. మరోవైపు వాళ్ల ఆచూకి తెలుసుకునేందుకు సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. కల్వర్టును మూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందం గాలిస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ప్రమాదానికి కారణమైన కల్వర్టు గత మూడేళ్లుగా మూసేసి ఉన్నట్లు చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేసేపటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
Also Read: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది
గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ప్రమాదానికి గురైన ఘటనలు ఇటీవల చాలానే జరిగాయి. ఆగస్టులో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి జసోల్ మాత గుడికి వెళ్తున్న ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించాడు. అది తప్పు దారి చూపించడంతో కారు అదుపుతప్పి ఒక పిల్లర్‌ను ఢీకొంది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. జులైలో నేవీ ముంబయిలో ఓ మహిళ గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయ్యి తన కారును ఒక క్రీక్‌లోకి (చిన్న నది లాంటిది) నడిపించింది. వెంటనే స్పందించిన మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది సురక్షితంగా ఆమెను రక్షించారు.