కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చాలామంది గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్తారు. అయితే కొన్నిసార్లు ఈ మ్యాప్స్ తప్పుదారిని కూడా చూపిస్తుంటాయి. వాహనాలు నదులు, చెరువుల్లోకి దూసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అసోంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. అది చివరికి పరాభవానికి దారి తీసింది. పోలీసులను స్థానికులు దొంగలుగా భావించారు. వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు.
Also Read: మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?
'' ఇక వివరాల్లోకి వెళ్తే అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన ఓ పోలీస్ టీమ్ నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఇందుకోసం ఆ పోలీస్ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు.అయితే ఆ మ్యాప్స్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపెట్టాయి. అది నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాలోని ఓ ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు.
Also Read: తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
అయితే పోలీసు వద్ద ఆయుధాలను చూసి అక్కడున్న స్థానికులు వాళ్లని దుండగులుగా భావించారు. దీంతో వాళ్లను దాడులు చేశారు. ఆ తర్వాత వాళ్లని బంధించారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. చివరికి ఈ విషయం తెలుసుకన్న జోరాత్ పోలీసులు మోకోక్‌చంగ్ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. స్థానికుల చేతిల్లో బంధీలైన పోలీసులను విడిపించేందుకు మరో పోలీస్ బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో ఆ పోలీస్ టీంకు క్షమాపణలు చెప్పి వదిలేశారు.
Also Read: ఆ విషయం KCRకు తెలుసా?: KTRను అడుగుతున్న 24 ప్రశ్నల లిస్ట్!