Google Maps: కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ

నవీ ముంబైలో ఓ మహిళ గూగుల్ మ్యాప్ చూపించిన షార్ట్‌కట్ దారిని ఫాలో అవుతూ, ఆమె కారు నీటి గుంతలో పడిపోయింది. బేలాపూర్ వంతెన దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా, మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను రక్షించారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.

New Update
Google Maps

Google Maps

Google Maps: మనకి తెలియని ప్రదేశాలకి వెళ్లిన్నపుడు నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్‌ను ఉపయోగిస్తుంటాం. రోజు రోజుకి గూగుల్ మ్యాప్ ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతనే ఉంటుంది. ఎటు వెళ్లాలన్న సరే చాల మంది గూగుల్ మప్స్ ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అయితే ఈ నమ్మకమే కొన్నిసార్లు ప్రమాదాలకు దారి తీస్తోంది. తాజాగా నవీ ముంబైలో జరిగిన సంఘటన ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది.

Also Read:'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్

కారు నేరుగా నీటి గుంతలోకి..

నవీ ముంబైకి చెందిన ఓ మహిళ, బేలాపూర్ నుంచి ఉల్వేకి కారులో వెళ్తోంది. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ చూస్తూ వెళ్తోంది. మ్యాప్ లో చూపించిన రూట్ లో గుడ్డిగా కార్ నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో ఆమె కారు నేరుగా ఓ నీటి గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బేలాపూర్ వంతెన సమీపంలో జరిగింది. నిజానికి ఆమె వంతెన మీదుగా వెళ్ళాల్సి ఉండగా, గూగుల్ మ్యాప్ మరో షార్ట్ కట్  దారిని చూపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ

సమాచారం అందుకున్న మెరైన్ సెక్యూరిటీ టీమ్ వెంటనే అక్కడకు చేరుకొని మహిళను సురక్షితంగా రక్షించారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలు కలగలేదు. కారును వాగులో నుంచి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమి మొదటి సారి కాదు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ గతంలో కూడా అనేకమంది ప్రమాదాల బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బరేలీ నుంచి బదౌన్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వంతెనపైకి వెళ్లి, నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై గూగుల్ స్పందించి విచారం వ్యక్తం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..

అలాగే, హైదరాబాద్‌కు చెందిన నలుగురు కేరళ ప్రయాణంలో మ్యాప్ చూపిన దారిని అనుసరించి ఓ వాగులో పడిపోయారు. అయితే వారు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరగటంతో,  గూగుల్ మ్యాప్ వంటి యాప్‌లలో అత్యవసర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా మ్యాప్‌ను ఉపయోగించేటప్పుడు కొంత జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Advertisment
తాజా కథనాలు