Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొద్ది రోజుల క్రితం గూగుల్ మ్యాప్ తప్పిదం వల్ల ముగ్గురు చనిపోగా..ఈసారి ఓ కుటుంబాన్ని అడవులపాలు చేసింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బిహార్ కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యాపారి ఉజ్జయిని నుంచి గోవాకు తన కుటుంబంతో కారులో బయల్దేరింది. Also Read: తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం.. ఈ క్రమంలో వారు గూగుల్ మ్యాప్ ని ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తున్నారు. సరిగ్గా వారు శిరోరి-హెమ్మడగా మధ్యలో దారి తప్పారు.మ్యాప్ సూచనల మేరకు వారు కారును నడపగా...అది తీసుకుని వెళ్లి అడవిలో పెట్టింది.ఫోన్లకు సిగ్నల్స్ లేకపోవడంతో వారు రాత్రంతా కారులోనే ఉండిపోయారు. Also Read: Cricket: సిరాజ్‌ను తిడుతున్న ఆస్ట్రేలియా మీడియా..అసలేమైంది? మొబైల్ నెట్ వర్క్ లభించిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారి లొకేషన్ ఆధారంగా ఖానాపుర ఠాణా పోలీసులు అక్కడకు చేరుకుని, వారిని రక్షించినట్లు ఇన్‌స్పెక్టర్ మంజునాథ నాయక్‌తెలిపారు. అక్కడి నుంచి గోవాకు వెళ్లే మార్గాన్ని ఆ కుటుంబానికి చెప్పారు. Also Read: Mytri Movie Makers: పుష్ప–2 షేక్ డైలాగ్స్‌పై టీమ్ సీరియస్ వార్నింగ్ గూగుల్ మ్యాప్స్ వల్ల నదిలోకి కారు.. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడం వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కిందపడిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు కారులో ప్రయాణిస్తున్నారు. Also Read: Maoist Attack: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోయిస్టుల మెరుపుదాడి ఉదయం 10 గంటల సమయంలో ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఆ కారు వేగంగా ప్రయాణించింది. వాళ్లు గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్తున్నారు. అయితే నావిగేషన్ పొరపాటు వల్ల నిర్మాణంలో ఉన్న వంతెనపైకి ఆ కారు దూసుకెళ్లింది. దీంతో బ్రిడ్జిపై నుంచి ఆ కారు రమగంగా నదిలో పడిపోయింది. చివరికి ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలల క్రితం భారీగా వచ్చిన వరదల వల్ల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. దీనిగురించి జీపీఎస్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల మ్యాప్‌లో తప్పుగా చూపించిందన్నారు. అలాగే బ్రిడ్జి ప్రవేశం వద్ద ఎలాంటీ సూచనలు, హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి తప్పుడు మార్గం వైపు వెళ్లిన ఘటనలు చాలానే జరిగాయి. నదులు, చెరువులోకి కార్లు దూసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.