Google Maps: విషాదం.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో వంతెన పైనుంచి కారు పడి ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. By B Aravind 24 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడం వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కిందపడిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు కారులో ప్రయాణిస్తున్నారు. Also Read: ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ? ఉదయం 10 గంటల సమయంలో ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఆ కారు వేగంగా ప్రయాణించింది. వాళ్లు గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్తున్నారు. అయితే నావిగేషన్ పొరపాటు వల్ల నిర్మాణంలో ఉన్న వంతెనపైకి ఆ కారు దూసుకెళ్లింది. దీంతో బ్రిడ్జిపై నుంచి ఆ కారు రమగంగా నదిలో పడిపోయింది. చివరికి ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. Also Read: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం! అనంతరం పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలల క్రితం భారీగా వచ్చిన వరదల వల్ల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. దీనిగురించి జీపీఎస్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల మ్యాప్‌లో తప్పుగా చూపించిందన్నారు. అలాగే బ్రిడ్జి ప్రవేశం వద్ద ఎలాంటీ సూచనలు, హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి తప్పుడు మార్గం వైపు వెళ్లిన ఘటనలు చాలానే జరిగాయి. నదులు, చెరువులోకి కార్లు దూసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. Also Read: మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే మొగ్గు! Also Read: ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ #uttarpradesh #national-news #google-maps మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి