/rtv/media/media_files/2025/07/22/gaza-2025-07-22-11-31-54.jpg)
Gaza death toll exceeds 59,000 as Israel continues brutal war on Palestinians
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. గత 21 నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 59 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 59,029 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్‌ఖడ్ రాజీనామాకు బలమైన కారణం అదేనా?
మరో 1.42 లక్షల మంది గాయాలపాలయ్యారని తెలిపింది. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలే ఉన్నారని చెప్పింది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడ ఆహారం కోసం పడిగాపులు కాస్తున్న గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని ప్రపంచ ఆహార సంస్థ (WFO) తెలిపింది. ఇదిలాఉండగా.. ఆదివారం గాజాలో ఆహారం తీసుకొచ్చిన వాహనాల కాన్వాయ్ వైపు పాలస్తీనా జన సమూహం దూసుకెళ్లారు. వాళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందారు.
Also Read: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?
ముప్పు ముంచుకొస్తుందని ముందుగానే హెచ్చరించి గాల్లో కాల్పులు జరిపిన తర్వాతే జనాలపై గురి పెట్టామని ఇజ్రాయెల్ చెప్పింది. మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చెబుతున్నారని ఆరోపించింది. మరో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దళాలు మధ్య గాజా నగరంలోకి కూడా ప్రవేశించాయి. ఈ చోటుకి ఇజ్రాయెల్ దళాలు రావడం ఇదే మొదటిసారి రావడం గమనార్హం.