/rtv/media/media_files/2025/07/13/israel-attacks-on-gaza-2025-07-13-14-36-02.jpg)
Israel Attacks on Gaza, 52 Killed
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. గాజాలో దాదాపు 250 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు చేసింది. మిలిటెంట్ల ఆయుధ నిల్వ స్థలాలు, మిస్సైల్ ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అలాగే సొరంగ మార్గాలపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది.
Also Read : విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
Israel Attacks On Gaza
🚨 Israel has killed at least 59 more Palestinians in Gaza over the past 24 hours
— Anadolu English (@anadoluagency) July 12, 2025
💢 Gaza death toll now exceeds 57,882, with over 138,095 injured https://t.co/vFwfLPBnSHpic.twitter.com/FhGaWqtlOf
Also Read: బిహార్ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్ పౌరులు
హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కూడా మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ గాజాను మాత్రం వదిలిపెట్టడం లేదు. హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఈ దాడుల్లో ఎక్కువగా పాలస్తీనా పౌరులే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
Also Read : స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu