Gaza: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 94 మంది మృతి

గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

New Update
94 Palestinians killed in Gaza

94 Palestinians killed in Gaza

హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగే అవకాశం ఉందనే సంకేతం వచ్చినప్పుడు కూడా దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  

Also Read: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకే.. రేసులో ముగ్గురు

ఇక బుధవారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ విషయాన్ని హమాస్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే గాజాలో మానవతా సాయం కూడా సరిగా అందడం లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపణలు చేసింది. మరోవైపు గాజా మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాయాన్ని గురువారం కూడా ఆ సంస్థ తప్పుబట్టింది. గత నెలలో చూసుకుంటే 500 మంది గాజా వాసులు ఈ సాయం పంపిణీ కేంద్రాల వద్ద మరణించినట్లు పేర్కొంది.  

Also read: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు

Advertisment
Advertisment
తాజా కథనాలు