/rtv/media/media_files/2025/07/24/hunger-cries-in-gaza-shocking-deaths-2025-07-24-08-15-28.jpg)
Hunger cries in Gaza... Shocking deaths
Gaza: ఇజ్రాయెల్‌యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆకలి చావులు కలచివేస్తున్నాయి. సరైన ఆహారం దొరకక వృద్దులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 111 మంది ఆకలితో మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది చిన్నారులే ఉండటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అభం శుభం తెలియని పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడచిన రెండు రోజుల్లోనే 20మంది పసివాళ్లు మృత్యువాత పడటం అక్కడి ఆకలి పరిస్థితికి అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ మానవతా సేవా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ విషయంలో రెండు దేశాలు స్పందించి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
గాజాలో ఆహార లేమి కారణంగా పోషకాహార సమస్యతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. సరైన ఆహారం లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు నీరసంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పసిపిల్లలకు పాలు పట్టేందుకు కూడా బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా గాజాలో పరిస్థితులు చేజారిపోతున్నాయని, సహాయ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటూ సేవ్ ది చైల్డ్, ఆక్స్‌ఫామ్, ఎంఎస్‌ఎఫ్ వంటి 115 మానవ హక్కుల, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ఆంక్షలు, సరిహద్దుల దిగ్బంధనం కారణంగా గాజాకు ఆహారపదార్థాలు పంపిచే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణాలు ఆకలి కేకలు, చావులకు కారణమవుతున్నాయని పేర్కొన్నాయి.
Also Read : మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!
ఇజ్రాయెల్ గాజాను అష్ట దిగ్బంధనం చేయడంతో మానవతాసాయానికి ఆటంకం ఏర్పడుతోంది. ఆహార పదార్థాలు లభించక పోవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఆహారం కోసం అల్లాడుతున్న పరిస్థితులు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ఆకలి, డీహైడ్రేషన్‌తో వృద్ధులు వీధుల్లోనే కుప్పకూలుతున్నారు. 20లక్షల జనాభా ఉన్న గాజాలో రోజుకు సరాసరి 28 ట్రక్కుల ఆహార పంపిణీ మాత్రమే జరుగుతోంది’’ అని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్య రాజ్యసమితి మానవతా వ్యవస్థ విఫలం కాలేదని, అది పనిచేయకుండా నిరోధించబడుతోందని తెలిపాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించి, అన్ని సరిహద్దులు తెరవాలని, తద్వారా మానవతాసాయం అందేలా చూడాలని పలు సామాజిక సంస్థలు కోరుతున్నాయి.
Also Read : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 59వేల పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. మానవతా సహాయ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య వెయ్యి దాటింది. వీరిలో ఎక్కువమంది సాయం కోసం ఎదురు చూస్తున్నవారేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం వెల్లడించింది. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కేంద్రాల వద్దే 700 మందికి పైగా చనిపోగా, మరో 300 మంది ఐరాస పంపిణీ కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇది మానవాత విలువలు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తుందని సామాజిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.