Gaza: గాజాలో దయనీయ పరిస్థితులు..సహాయ కేంద్రంలో తొక్కిసలాట..20 మంది మృతి

ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు అక్కడ కరువు తాండవిస్తోంది. పట్టెడన్నం కోసం పాలస్తీనియన్లు దేనికైనా వెనకాడడం లేదు. ఈ క్రమంలో గాజాలో సహాయక కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 20 మంది చనిపోయారు. 

New Update
gaza stampede

Gaza stampede

నిన్న గాజా స్ట్రిప్ లో అమెరికన్ సంస్థ నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా బాగా దెబ్బ తింది. అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేదు. దీంతో ఐరాసతో పాటూ చాలా దేశాల సంస్థలు గాజావాసులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. కానీ అది కూడా అక్కడి వారికి సరిపోవడం లేదు. దీంతో గాజా ప్రజలు ఆహారం కోసం అల్లల్లాడిపోతున్నారు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడకు పరుగులు తీస్తున్నారు. గుప్పెడు మెతుకులు దొరికితే చాలని ఎగబడుతున్నారు. దీంతో సహాయకకేంద్రాల దగ్గర తొక్కిసలాటలు జరుగుతున్నాయి. 

ఆహారం కోసం ఎగబడడంతోనే..

నిన్న అమెరికా సంస్థ నిర్వహించిన ఆహార పంపిణీ కేంద్రంలో కూడా తొక్కిసలాట అయింది. ఇందులో 20 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఆహారం కోసం జనాలు ఎగబడడంతోనే తొక్కిసలాట జరిగిందని అమెరికా సంస్థ తెలిపింది. అయితే ఆహార పంపిణీ కేంద్రంలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ అశాంతిని రెచ్చగొట్టిందని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆరోపించింది. కానీ ఇజ్రాయెల్ సైన్యం వాదన మరోలా ఉంది. గాజా ప్రజల్లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడ్డారని చెబుతోంది. సహాయక కేంద్రం తెరవక ముందే కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారని...వారిని ఆపేందుకు GHF గార్డులు స్టన్ గ్రెనేడ్లు విసిరారని మరియు పెప్పర్ స్ప్రేను ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చుట్టూ కంచె వేసి ఉండడం, ప్రజలు భయాందోళనలకు గురవడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ నిన్న మళ్ళీ దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దళాలు చాలా మంది చంపాయి. ఈ దాడుల్లో 14 మంది పిల్లలతో సహా 54 మంది మరణించారని గాజాలోని ఆసుపత్రి అధికారులు తెలిపారు. 

Also Read: Israel: మిత్ర దేశాలు వాకౌట్..పార్లమెంటరీ మెజార్టీ కోల్పోయిన నెతన్యాహు పార్టీ

Advertisment
Advertisment
తాజా కథనాలు