/rtv/media/media_files/2025/06/08/JTAt8nL1GApHHGPEpLv9.jpg)
Israel Claims To Have Found Hamas Tunnel Under Key Gaza Hospital
గాజాపై ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఓ సంచలన వీడియో బయటపడింది. ఖాన్ యూనస్‌లోని ఓ కీలకమైన ఆస్పత్రి కిందే హమాస్ సొరంగాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఎక్స్‌లో షేర్ చేసింది. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌడ్‌లో ఓ సొరంగాన్ని గుర్తించామని పేర్కొంది. హమాస్ సీనియర్ కార్యకర్తలు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా, అలాగే ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ప్లాన్‌లు రచించేలా ఆ సొరంగాన్ని వినియోగిస్తున్నారని తెలిపింది.
Also Read: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
Hamas Tunnel Under Key Gaza Hospital
ఆ సొరంగంలో చూసుకుంటే ఆయుధాలు, నిఘా సామాగ్రితో పాటు ఇతర పరికరాలతో కూడిన కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలన్ బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు చేసిన ఆపరేషన్‌లో ఈ వీడియోను సేకరించినట్లు IDF తెలిపింది. హమాస్ తన ప్రయోజనాల కోసం గాజాలో ఆస్పత్రులను స్థావరాలుగా వాడుకుంటోందని విమర్శించింది. దీనివల్ల పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
2023లో కూడా ఇలాగే గాజాలోని ఓ పెద్ద ఆస్పత్రి అయిన అల్‌షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఐపీఎఫ్ తెలిపింది. వాటిని ధ్వంసం చేసేందుకు అక్కడ మేము దాడులు చేస్తే అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన వాదనలను పాలస్తీనా అధికారులు ఖండిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా జరిగిన దాడిలో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం చెప్పింది.
Also Read: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza.
— Israel Defense Forces (@IDF) June 7, 2025
In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8
Also Read : పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో! (వీడియో వైరల్)
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu