/rtv/media/media_files/2025/06/10/MmzuXcmQeNaOS830gxgb.jpg)
Greta Thunberg deported from Israel after Gaza boat seized
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. గాజాలో పరిస్థితులు అధ్వానంగా మారిపోయాయి. మానవతా సాయం కోసం అక్కడి స్థానికులు ఎగబడుతున్నారు. అయితే గాజాలో మానవతా సాయం అందించడం కోసం స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఓ నౌకలో వెళ్తుండగా.. ఆమెతో సహా 12 మందిని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా గ్రెటా థన్‌బర్గ్‌ను దేశం నుంచి వెనక్కి పంపించామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: 30 ఏళ్లకే 10 పెళ్లిళ్లు.. అడ్డంగా బుక్కైన నిత్య పెళ్లికూతురు!
గ్రెటా థన్‌బర్గ్‌ను ఫ్రాన్స్‌కు పంపిస్తున్నామని.. అక్కడి నుంచి ఆమె స్వీడన్‌కు వెళ్తుందని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రూల్స్‌కు విరుద్ధంగా తమ సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. గ్రెటాతో పాటు మరో ఇద్దరు కార్యకర్తలు, ఓ జర్నలిస్టు ఇజ్రాయెల్ నుంచి వెళ్లేందుకు ఒప్పుకోవడంతో వాళ్లని ఫ్రాన్స్‌కు పంపించినట్లు ఇజ్రాయెల్‌లోని లీగల్ రైట్స్ గ్రూప్ అదాలా తెలిపింది. ఇతర కార్యకర్తలు ఇజ్రాయెల్ నుంచి వెళ్లేందుకు నిరాకరించడంతో వాళ్లు నిర్బంధంలో ఉన్నారని.. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఇక వివరాల్లోకి వెళ్తే గాజా పౌరుల కోసం మానవతా సాయం అందించేందుకు గ్రెటా థన్‌బర్గ్‌తో సహా 12 మంది జూన్ 6న సిసిలీ ప్రాంతం నుంచి ఓ నౌకలో బయలుదేరారు. సాయంత్రానికి వాళ్లు గాజా చేరుకోవాల్సి ఉంది. కానీ సోమవారం తెల్లవారుజామున వీళ్లను ఇజ్రాయెల్ ఆర్మీ అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంది. ఆ తర్వాత వీళ్లు వచ్చిన నౌకను ఇజ్రాయెల్ పోర్టుకు మళ్లించింది. అనంతరం ఆ నౌకను అదుపులోకి తీసుకుంది. ఆ నౌక సాయం కోసం వస్తుంది కాదని.. సెలబ్రిటీల సెల్ఫీ యాత్ర అని ఇజ్రాయెల్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపణలు చేసింది.
Also Read: భార్య టార్చర్ భరించలేకపోతున్నా: ఆర్మీ జవాన్