BIG BREAKING: మరో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం!
తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
భారత నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఒమన్‌కు బయల్దేరిన ఎం.టి యీ చెంగ్ 6 అనే నౌకలో మంటలు చెలరేగాయి. ఇంజిన్ గదిలో ఉన్నట్టుండి మంటలు అంటుకోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన జరిగింది. భార్య విడాకులు ఇచ్చిందనే కోపంతో ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ రైలుకే నిప్పటించాడు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో మరో బోగిలోకి పరిగెత్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, భారీ ఎత్తున ఎగసిపడుతుంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది 15 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ముంబై గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 5 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ సీరియల్ సెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నాగ్‌పూర్ లోని మహల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వస్తువుల గిడ్డంగిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను గిడ్డంగి యజమాని గిరీష్ ఖత్రి, ఉద్యోగి విఠల్ ధోటేగా గుర్తించారు.