/rtv/media/media_files/2025/05/18/DS6CPoDIj9vSiJitvT2E.jpg)
Maharastra Fire Accident
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో గల మహల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక విద్యుత్ వస్తువుల గిడ్డంగిలో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
భారీ అగ్నిప్రమాదం
మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను గిడ్డంగి యజమాని గిరీష్ ఖత్రి (35), ఉద్యోగి విఠల్ ధోటే (25) గా గుర్తించారు. మరో బాధితుడు గున్వంత్ నాగ్‌పూర్కర్ (28) తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
అందిన సమాచారం ప్రకారం.. జై కమల్ కాంప్లెక్స్‌లోని జుమ్మా మసీదు సమీపంలో ఆర్‌కె లైట్ హౌస్ అనే ఎలక్ట్రిక్ గూడ్స్ షాప్ ఉంది. దీని పైన ఒక గొడౌన్ ఉంది. దీని లోపల వెల్డింగ్ పనులు జరుగుతుండగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు మెల్ల మెల్లగా అంతస్తుల్లోని ఇళ్లల్లోకి వ్యాపించింది.
అదే సమయంలో ఈ గిడ్డంగిలో హాలోజన్ లైట్లు, బాణసంచాతో సహా వివిధ విద్యుత్ వస్తువులు ఉన్నాయి. దీంతో అక్కడ ఉంచిన టపాకాయలు, ఇతర మండే పదార్థాలకు మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించి కొన్ని నిమిషాల్లోనే గిడ్డంగి మొత్తాన్ని అంటుకున్నాయి.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
సమాచారం అందిన వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలను సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us