Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన కంపెనీ - వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, భారీ ఎత్తున ఎగసిపడుతుంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

New Update
uttar pradesh fire breaks out in private firm in noida sector 2

uttar pradesh fire breaks out in private firm in noida sector 2

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read :  వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయ్

Fire Accident In Private Firm

దట్టమైన నల్లటి పొగ, మంటలు పెద్ద పెద్దగా ఎగసిపడుతుండటంతో అదుపుచేసేందుకు కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

Also Read :  టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా దూరం..! - అతడి స్థానంలో ఎవరంటే?

టోల్ టాక్స్ అడిగితే గన్ తీశాడు

ఇదిలా ఉంటే నిన్న పంజాబ్‌లో దారుణం జరిగింది. జలంధర్-అమృత్‌సర్ జాతీయ రహదారి వద్ద టోల్‌ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్‌ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జలంధర్-అమృత్‌సర్‌ నేషనల్‌ హైవే వద్దకు ఓ కారు వచ్చింది. ఆ డ్రైవర్‌ను టోల్‌ట్యాక్స్ చెల్లించాలని సిబ్బంది అడిగాడు. 

Also Read: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్‌

కానీ ఆ వ్యక్తి కారులోంచి కిందకు దిగి సిబ్బందిపై తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో టోల్‌ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. చివరికి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.  

Also Read :  ఇలా ఉన్నావేంట్రా.. వంట నచ్చలేదని కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు!

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు