/rtv/media/media_files/2025/06/27/man-upset-over-divorce-sets-fire-to-moving-train-in-seoul-2025-06-27-17-35-37.jpg)
Man Upset Over Divorce Sets Fire To Moving Train In Seoul, Faces Trial
దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన జరిగింది. భార్య విడాకులు ఇచ్చిందనే కోపంతో ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ రైలుకే నిప్పటించాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సియోల్‌లో ఉంటున్న వాన్ (67) అనే వ్యక్తికి ఇటీవల తన భార్య నుంచి విడాకులయ్యాయి. ఇలా జరగడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఆ బాధలో యోవనారు అనే ప్రాంతం నుంచి మాపో వైపు వెళ్తున్న సబ్‌వే రైలులో ప్రయాణించాడు.
Also Read: జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి, జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. VIDEO
దీంతో అతడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆ రైలులోనే పోసి నిప్పటించాడు. సముద్ర గర్భంలోని టన్నెల్‌లో రైలు వెళ్తుండగా ఈ పనికి పాల్పడ్డాడు. రైలులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో మరో బోగిలోకి పరిగెత్తారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.
서울지하철 5호선 방화범 CCTV
— 브이몬 (@XXV_mon) June 25, 2025
사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH
Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
అయితే మంటల నుంచి వచ్చిన పొగ పీల్చి 22 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీళ్లలో నిందితుడు కూడా ఉన్నాడు. చివరికీ వీళ్లందరినీ రైల్వేసిబ్బంది ఆస్పత్రిలో చేర్పించారు. మరో 129 మందికి ఘటనాస్థలంలోనే చికిత్స అందించారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు 330 మిలియన్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. చికిత్స తర్వాత నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన