BIG BREAKING: మరో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం!

తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Massive blast at firecracker unit in Tamil Nadu Sivakasi, 5 dead

Massive blast at firecracker unit in Tamil Nadu Sivakasi, 5 dead

తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాణసంచా తయారీ కేంద్రంలో మందుగుండు సామగ్రి కలుపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు ప్రభావానికి మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Also Read: పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

ఇదిలాఉండగా సోమవారం సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు భవనం, శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులేల్లో 11 మంది పరిస్థితి విషయమంగా ఉందని.. ప్రస్తుతం వాళ్లకి ఐసీయూలో చికిత్స జరుగుతోందని పేర్కొన్నారు. 

Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

Advertisment
Advertisment
తాజా కథనాలు