Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం - షాకింగ్ వీడియోలు

ఢిల్లీలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది 15 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. 

New Update
delhi fire broke out in factory

delhi fire broke out in factory

ఢిల్లీలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో దాదాపు 15 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 

Delhi Fire Accident


 
ఈ ఘటనపై ఢిల్లీ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఎకె జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా ప్లాస్టిక్, బట్టలపై ప్రింటింగ్ పనులు జరుగుతాయి. ఇక్కడి ప్రజలు 2-3 మందిని ఆసుపత్రికి తరలించాం. 15 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేశారు.’’

Advertisment
Advertisment
తాజా కథనాలు