Fire Breaks Film City: ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన సెట్ - షాకింగ్ వీడియో

ముంబై గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 5 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ సీరియల్ సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

New Update
Fire breaks out on Anupamaa set in Mumbai Film City

Fire breaks out on Anupamaa set in Mumbai Film City

ముంబై గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 5 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక టీవీ సీరియల్ సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 7:00 గంటలకు షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు మంటలు సెట్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Mumbai Film City Fire Breaks

ఈ సంఘటన జరిగిన సమయంలో చాలా మంది కార్మికులు, సిబ్బంది అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలకు గల కారణాన్ని పరిశీలిస్తున్నారు.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

  

అయితే ప్రణాళిక ప్రకారం షూటింగ్ ప్రారంభమై ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని.. ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణకు ఆదేశించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కోరుతూ ఓ లేఖ రాశారు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, ముంబై లేబర్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా నిబంధనలను అమలు చేయడంలో వారి వైఫల్యానికి వారిని బాధ్యులుగా చేయాలని అందులో పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కార్మికుల జీవితాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని AICWA ఆరోపించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు