BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా బలగాలు తెలిపాయి.
Delhi Encounter: ఢిల్లీలో ఎన్కౌంటర్.. పోలీసులపై కాల్పులు!
ఢిల్లీలో ఎన్కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లాలో కాలా జాథేడి గ్యాంగ్, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ అమిత్ డాగర్, అంకిత్ కాళ్లకు బుల్లెట్లు విడిచి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఓం ప్రకాష్ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.
Encounter: ఒకే రోజు రెండు ఎన్కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!
మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఉదయం బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.
Encounter: వారిని ఎన్కౌంటర్ చేయండి.. సీఎం సంచలన ఆదేశాలు!
ముంగేర్ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు పోలీసులపై దాడికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేయాలని డిప్యూసీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. నేరాలను అంతం చేయడానికి కఠిన చర్యలుంటాయన్నారు.
Encounter in Bihar: బీహార్‌లో కలకలం.. పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య భీకర కాల్పులు
బీహార్ రాజధాని పాట్నాలో తూటాలు పేలడం కలకలం రేపింది. నలుగురు గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Chhattisgarh Encounter : భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం ఉదయం తెలిపారు. భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
చత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో 8మంది మావోలు మృతి చెందారు.
Gariyaband Encounter: ఎన్కౌంటర్లో చనిపోయింది చంద్రహాస్ కాదు.. ఇతనే
గరియబంద్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత చంద్రహాస్ అలియాస్ పాండు చనిపోలేదని పోలీసులు వెల్లడించారు. చినిపోయింది ధమరీ-గరియా బంద్-నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి సత్యం గాన్దే అని తెలిపారు. చనిపోయిన వారి ఫొటోలు, వివరాలను పోలీసులు వెల్లడించారు.