/rtv/media/media_files/2025/05/24/zg8YUDnBjnOc2PnPApT5.jpg)
Jhurkhand Latehar encounter Two Maoists died
Maoist Encounter: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఝూర్ఖండ్ లోని లాతేహార్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఝూర్ఖండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంజు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. పప్పుపై 10 లక్షలు, ప్రభాత్‌పై 5లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి ఇన్సాస్ రైఫిల్ సహా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
5కిలోమీటర్ల మేర 15వేల మంది..
మరోవైపు ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యన్ని చుట్టిముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. లొంగిపోయేందుకు కొంతమంది మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
ఇప్పటికే కొంతమంది అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 45 వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని అడవిని జల్లెడ పడుతున్నాయి. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ మరణించడంతో బలగాలకు మరింత ఉత్సహంతో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే చేధించాల్సివుండగా.. నారాయణపుర్, బీజాపుర్, దంతెవాడల మధ్య దట్టమైన అడవిలోనే మావోయిస్టులున్నారనే సమాచారంతో ముందుకెళ్తున్నారు.
Also Read: 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు
jharkhand | today telugu news