/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed.jpg)
Maoists
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్ నిర్వహించగా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో పోలీస్ స్పెషల్ కమాండో యూనిట్ సీ-60, సీఆర్‌పీఎఫ్ కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు నిర్వహించగా నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో..
ఇదిలా ఉండగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. నంబాల కేశవరావు 1955లో శ్రీకాకుళం జిల్లా జయ్యన్న పేటలో జన్మించారు.
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
కేశవరావు మాజీ కబడ్డీ ఆటగాడు. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మావోయిస్ట్‌లుగా మారారు. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని జాండ్రపేటకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో సజ్జా పుట్టాడు. వీరిది చేనేత కుటుంబం. జాండ్రపేటలో స్కూల్ విద్య చదివి గుంటూరులో పాలిటెక్నిక్ చదివారు. అయితే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యమానికి జీవితకాలం కార్యకర్తగా వెళ్లి నాగేశ్వరరావు అరెస్టు అయ్యారు. కొన్నాళ్లు జైలులో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మావోయిస్ట్‌లో చేరారు.
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
maoists | encounter | maharstra