Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 9మంది అరెస్ట్
HYDలో డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, తుపాకీ, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
HYDలో డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, తుపాకీ, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఓ సంచలన విషయం బయటపడింది. ‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సప్ కోడ్‌తో గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 మందిని అదుపులోకి తీసుకోని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు.
హైదరాబాద్ లో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్ టీం స్పష్టం చేసింది.
హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ టీం బయటపెట్టింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు టీం గుర్తించింది. రెస్టారెంట్ ఓనర్ సూర్య నేతృత్వంలో డ్రగ్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు.
తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని సినీ నిర్మాత దిల్‌రాజు పిలుపునిచ్చారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకున్నవారిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు.
మంబై ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఏకంగా రూ.11.39 కోట్ల కొకైన్‌ను సీజ్ చేశారు. నిందితుడి కడుపులో 67 కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. అతడు సియోరాలియోన్ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక వివాదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంత ప్రముఖులైనా సరే నిబంధనలను పాఠించకపోతే.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలీయాస్ సత్యవతి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసులో పలువురు సెలెబ్రిటీలు పట్టుపడటం సంచలనంగా మారింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా పలువురికి పార్టీ ఇచ్చింది.
రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.