వెనుజులాపై అమెరికా యుద్ధం.. ఆ చాకుతో షిప్ పేల్చేసిన ట్రంప్!

వెనిజులా సముద్ర తీరంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారని ఓ నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు హతమైనట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. అమెరికన్ ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడటానికే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

New Update
Venezuela

వెనిజులా తీరానికి సమీపంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారని ఓ నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు హతమైనట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. అమెరికన్ ప్రజలకు మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడంలో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ జలాల్లో జరిగిందని, ఈ నౌక అమెరికాకు డ్రగ్స్ పెద్ద మొత్తంలో తరలిస్తోందని నిఘా వర్గాలు ధృవీకరించినట్లు హెగ్సేత్ తెలిపారు. దాడిలో హతమైన నలుగురు 'నార్కో-టెర్రరిస్టులు' అని పేర్కొన్నారు. ఈ నౌక కూల్చివేతకు సంబంధించిన వీడియోను కూడా రక్షణ కార్యదర్శి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సెప్టెంబర్ నెల ప్రారంభం నుండి వెనిజులా సమీపంలో డ్రగ్స్ తరలిస్తున్న నౌకలపై అమెరికా సైన్యం దాడులు జరపడం ఇది నాలుగోసారి. గత దాడుల్లో మొత్తం 17 మందికి పైగా మరణించినట్లు అంచనా. ఈ వరుస దాడులు డ్రగ్స్ ముఠాలతో 'సాయుధ పోరాటం' చేస్తున్నట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించిన నేపథ్యంలో మరింత తీవ్రమయ్యాయి. అయితే, ఈ దాడుల చట్టబద్ధతపై అంతర్జాతీయ న్యాయ నిపుణులు, అమెరికా కాంగ్రెస్‌లోని కొంతమంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగెజ్ ఈ చర్యను 'యుద్ధ చర్య'గా అభివర్ణించారు, ఇది తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు పాలనా మార్పు కోసం అమెరికా ఓ చాకుగా వాడుతోందని మండిపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ సముద్ర జలాల్లో వెనిజులా సైనిక విన్యాసాలు కూడా చేపట్టింది. అమెరికన్ల రక్షణ కోసం ఈ దాడులు కొనసాగుతాయని రక్షణ కార్యదర్శి హెగ్సేత్ స్పష్టం చేశారు. కరేబియన్ సముద్రంలో చాలా గందరగోళం నెలకొంది. అమెరికా వెనిజులా తీరానికి F-35 ఫైటర్ జెట్‌లు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లు, అలాగే ఓ న్యూక్లియర్ జలాంతర్గామిని మోహరించింది. దీనిని డ్రగ్ నివారించే చర్య అని అమెరికా చెబుతోన్నా.. వెనిజులా మాత్రం ట్రంప్ బహిరంగ యుద్ధ హెచ్చరికలు జారీ చేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈక్రమంలో వెనుజుల అధ్యక్షుడు మదురో ట్రంప్ సైన్యంతో పోరాడటానికి సిద్ధమయ్యారు. యుద్ధం కోసం 3.7 మిలియన్ల మంది బలగాలను మోహరించారు. 

Advertisment
తాజా కథనాలు