EAGLE Force: త్వరలో న్యూయర్ వేడుకలు.. పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దందాలు

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. దీంతో డ్రగ్స్‌ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

New Update
EAGLE Force Busts MMDA Network ahead of new year celebrations

EAGLE Force Busts MMDA Network ahead of new year celebrations

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. దీంతో డ్రగ్స్‌ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సైబరాబాద్‌ పోలీసులు దీనిపై గట్టి నిఘా పెడుతున్నా కూడా కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్‌ దందా కొనసాగుతోంది. ఇటీవల ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్టు చేసిన ఘటన సంచలనం రేపింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి న్యూ ఇయర్‌ సందర్భంగా డ్రగ్స్‌ పార్టీ చేసుకునేందుకు MMDA డ్రగ్స్‌ తీసుకొస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్ SOT పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

Also Read: పీల్చే గాలిలో కూడా ‘మైక్రోప్లాస్టిక్స్‌’.. వెలుగులోకి సంచలన నిజాలు

తాజాగా ఈగల్ ఫోర్స్‌(EAGLE Force) కూడా రాచకొండ పోలీసులతో కలిసి MMDA డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించింది. హైదరాబాద్‌, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంది. సైనిక్‌పూరి, నేరెడ్‌మెడ్, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా ముగ్గురు డ్రగ్స్‌ పెడ్లర్లను, ఇద్దరు వినియోగదారులను అరెస్టు చేసింది. వాళ్ల నుంచి 15 గ్రాముల MMDA, 12 LDS బ్లాట్‌లను స్వాధీనం చేసుకుంది. నిందితులను విచారించగా వారు ఇతర కస్టమర్లకు కూడా MMDA అమ్మినట్లు తేలింది. 

ఇటీవల చిక్కడపల్లిలోని ఓ డ్రగ్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ ఐటీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుస్మిత అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ ఇమాన్యుల్‌ కలిసి డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. సుస్మిత, ఇమాన్యుల్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ముఠా యువతను టార్గెట్‌ చేసుకుని డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

కొన్నిరోజుల క్రితమే ఈగల్ టీమ్‌ పోలీసులు తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MMDA స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రాయదుర్గంలోని హస్టల్లో ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. డిసెంబర్‌ 22న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు అయిదుగు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG గాంజా, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు.. కొత్త సర్పంచ్ లకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్!

ఇదిలాఉండగా కోంపల్లిలో మరో భారీ డ్రగ్స్(drugs) దందా బయటపడింది. ప్రేమ, సహజీవనం పేరుతో అమ్మాయిలకు వల వేస్తూ డ్రగ్స్‌ దందాలోకి దింపుతున్న నిందితుడిని నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అమ్మాయిలనే ఏజెంట్లుగా నియమించి అతడు డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా వరుసగా డ్రగ్స్‌ పట్టుపడటం కలకలం రేపుతోంది. మరికొన్ని రోజుల్లో న్యూయర్ వేడుకలు రానున్న నేపథ్యంలో డ్రగ్స్‌ దందాపై పోలీసులు మరింత నిఘా పెట్టారు. ఎవరైనా పట్టుబడితే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

సజ్జనార్ వార్నింగ్ 

న్యూ ఇయర్‌ వేడుకలు రానున్న వేళ తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్‌(sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయర్ వేడుకల్లో నిర్వాహకులు, ప్రజలు రూల్స్ అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. నేటి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9 గంటల నుంచి నగరం నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కఠినంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు తమ కార్యక్రమాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. పార్టీలు నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగా ప్రదేశాల్లో సౌండ్ సిస్టంలు, లౌడ్‌ స్పీకర్లు రాత్రి 10 గంటలకల్లా ఆఫ్‌ చేయాలన్నారు. అలాగే మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మఫ్టీలో 15 షీ టీమ్స్ దళాలు సైతం గస్తీ నిర్వహిస్తాయని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు