Drug mafia : రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న డ్రగ్స్ మాఫియా..డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్

హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ఓ డాక్టర్‌ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్‌ డెన్‌గా మార్చిన డాక్టర్‌ జాన్‌పాల్‌.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన పోలీసులు అతని ఇంటిపై దాడిచేశారు.

New Update
FotoJet - 2025-11-04T113722.173

Drug den in doctor's house

Drug mafia :  హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ఓ డాక్టర్‌ ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తన ఇంటిని డ్రగ్స్‌ డెన్‌గా మార్చిన డాక్టర్‌ జాన్‌పాల్‌.. ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన పోలీసులు, మంగళవారం ఉదయం అతని ఇంటిపై దాడిచేశారు. ఈ సందర్భంగా ఓజీ కుష్‌, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ జాన్ పాల్ను అరెస్ట్ చేశారు. 3 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్ ఇంట్లో STF బీ టీం సోదాలు చేసింది. ప్రమోద్, శరత్, సందీప్ అనే ముగ్గురు యువకులు.. బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకుని డాక్టర్ ఇంట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పెట్టి తెలిసిన వారికి అమ్మకాలు జరిపినట్లు విచారణలో తేలింది. 

ఈ మొత్తం వ్యవహారం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ డాక్టర్ ప్రాణాంతకమైన డ్రగ్స్కు బానిస అయ్యాడని చెప్పారు. డ్రగ్స్ కొనాలంటే తన దగ్గర తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ డ్రగ్స్ అమ్మకాలు తన ఇంటి నుంచి చేసినందుకు తన దగ్గర ఉన్న డ్రగ్స్ను తాను ఉచితంగా వాడుకుంటూ డాక్టర్ జాన్ పాల్ అమ్మకాలు జరుపుతున్నట్లు STF టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్.ఐ బాలరాజు, కానిస్టేబుల్ విజయ్ కృష్ణ కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 26.95 గ్రాముల ఓజి కుష్, 6.21 గ్రాముల ఎండిఎంఎ, 15 ఎల్ ఎస్ డి బాస్ట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరత్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కూడా కేసు నమోదు చేశారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం పోలీసులను అభినందించారు.

Also Read :  చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు

Advertisment
తాజా కథనాలు