Mumbai : ముంబయి ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్‌, బంగారం పట్టివేత

అక్రమ రవాణాకు  మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. Mumbai airport లో రూ.45 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
 drugs

drugs

Mumbai: బంగారం, డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తూ ఇప్పటికే పలువురు పట్టుబడినప్పటికీ కొత్త కొత్త ఎత్తుగడలతో పలువురు అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా అక్రమ రవాణాకు  మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. Mumbai airport లో రూ.45 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న దాదాపు 12మందిని అరెస్టు చేశారు. 

కాగా ఈనెల 3 నుంచి 10 మధ్య Mumbai airport లో పలు ఆపరేషన్‌లు నిర్వహించినట్లు పోలీసు అధికారులు వివరించారు. తొలుత తొమ్మిది మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.37.26 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చింతపండు ముద్దలో  డ్రగ్స్‌ దాచి వారు బ్యాంకాక్‌ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వీరందరూ బ్యాంకాక్‌ నుంచి పలు విమానాల్లో ఇక్కడికి వచ్చారన్నారు.

 అలాగే మరో ఆపరేషన్‌లో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. నలుగురు ప్రయాణికుల నుంచి రూ.1.51 కోట్ల విలువైన బంగారం, మరో వ్యక్తి నుంచి రూ.87 లక్షల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కాగా ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు