Hyderabad Drug Bust: హైదరాబాద్‌‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..ఓవర్ డోస్ తో యువకుడు...

తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

New Update
drugs

Drug gang busted in Hyderabad

Hyderabad Drugs: తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఇటీవల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో తరుచుగా డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పలు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ మరికొంతమంది అదే పని చేసి పట్టుబడుతున్నారు. ఇటీవల రహస్యంగా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందడంతో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్న వారితో పాటు డ్రగ్స్ అమ్మకందారులను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో డ్రగ్స్ ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు.

రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు  నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో.. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వస్తున్న నలుగురు యువకులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్ సప్లైయర్‌ సంగడి సంతోష్‌తో పాటు గాంధీ సందీప్ కండేపల్లి, శివ పలక, సాయిబాబులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ఓవర్ డోస్ తో యువకుడు...


యువత  డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ఈజీగా లభ్యం అవుతుండటంతో యువత డ్రగ్స్‌ను తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నా తాజాగా డ్రగ్స్ తీసుకుని ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది.

డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజేంద్రనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో నిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అలీ డ్రగ్స్ సేవించాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంతో అలీ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అలీకి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది?... ఎవరి దగ్గర తీసుకున్నాడు? అలీకి డ్రగ్స్‌ను ఎవరు విక్రయించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు