Sajjanar: హైదరాబాద్ లో వీధికొక్క రౌడీ.. ఒక్కొక్కన్ని ఉరికిస్తా.. కొత్త సీపీ సజ్జనార్ సంచలన ఇంటర్వ్యూ-VIDEO

రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హైదరాబాద్ కొత్త సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తన వంతు సహకారం అందిస్తానన్నారు.

New Update
Sajjanar Hyderabad CP

రౌడీయిజం, సైబర్ క్రైం(Cyber Crime), డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హైదరాబాద్ కొత్త సీపీ సజ్జనార్(hyderabad new CP sajjanar) స్పష్టం చేశారు.  తను ఏ విభాగంలో పని చేసినా స్పీడ్, స్టైల్ ఏ మాత్రం తగ్గదనన్నారు. ఆర్టీసీ ఎండీ నుంచి హైదరాబాద్ కమిషనర్ గా ప్రమోషన్ పొందిన నేపథ్యంలో ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని, అత్యంత కఠినంగా వ్యవహరిస్తానన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనకు నాన్ యూనిఫాం సర్వీస్ కొత్త కాదన్నారు. గతంలో ఇంటెలిజెన్స్, ఏసీబీ విభాగాల్లో పని చేశానన్నారు. రౌడీయిజం, సైబర్ క్రైం, డ్రగ్స్, మహిళల భద్రత, ఆర్థిక నేరాలు అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్రగ్స్ పై యుద్ధం చేస్తామన్నారు. కష్ట పడకుండా డబ్బులు రావాలని అనుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాయమాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read :  గిన్నిస్ రికార్డుల్లోకి తెలంగాణ బతుకమ్మ!

మహిళల రక్షణకు ప్రాధాన్యం..

ప్రతీ సిటిజెన్ కూడా పోలీస్ లాగా భావించి నేరాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలన్నారు. నెట్వర్క్ అంతా బ్రేక్  చేస్తేనే డ్రగ్స్ ను అరికట్టడం సాధ్యమన్నారు. పక్కా ప్రణాళికతో డ్రగ్స్(drugs) ను కట్టడి చేస్తామన్నారు. నేరాలపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇటీవల హైదరాబాద్ లో మహిళల హత్యలు పెరుగున్నాయని రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇలాంటి నేరాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతానన్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు ఎదురైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాంటి మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 100కు ఫోన్  చేయడం లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా మహిళలు రక్షణ పొందాలని సూచించారు.

Also Read :  పండుగ పూట పెను విషాదం.. నల్గొండలో ముగ్గురు స్పాట్ డెడ్!

సోషల్ మీడియా(Social Media) లో ఇతరులకు ఇబ్బంది కలిగించే పోస్టులు పెట్టొద్దన్నారు. హైదరాబాద్ లో వీధికి ఒక్క రౌడీ ఏర్పడిన పరిస్థితి ఉందన్న రిపోర్టర్ ప్రశ్నకు స్పందిస్తూ.. నేరాలను అరికట్టడానికి మూడు కమిషనరేట్ల అధికారులను సమన్వయం చేస్తూ పని చేయనున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆర్టీసీ ఎండీగా అనేక అనుభవాలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ సిబ్బందితో చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉందన్నారు. ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ అంటే అది ప్రజా రవాణా డిపార్మెంట్ అని అన్నారు. మహాలక్ష్మి స్కీంతో మహిళల ఫ్రీ టికెట్ రీయింబర్స్ మెంట్ డబ్బులు ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో సంస్థకు మేలు జరిగిందన్నారు. ఇది తనకు చాలా సంతృప్తి ఇచ్చిందన్నారు సజ్జనార్. రానున్న రోజుల్లో ఇతర సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు