/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పెద్దమంగళారంలోని చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ఫాంహౌస్ పార్టీలో 50 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో 14 మంది బాలికలు, 34 మంది మైనర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారందరికి డ్రగ్ టెస్ట్ చేయగా.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. ఇంటర్ విద్యార్థులు కిషన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ల్ఫేయేన్సర్ సాయంతో పార్టీ ప్లాన్ చేశారు. అతను ఇన్‌స్టాగ్రాంలో ట్రాప్ హౌస్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1600 వసూలు వసూలు చేశాడు. ఒంటరిగా వస్తే ఒక రేటు, జంటగా వస్తే మరో రేటుతో పాస్‌లు ఇచ్చి మరీ మొయినాబాద్ ఫాంహౌస్‌లో పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.
"ట్రాప్ హౌస్ పార్టీ" పేరుతో ఫామ్ హౌసులో 50 మంది మైనర్ల మత్తు పార్టీ
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2025
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం..ఇద్దరు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ
హైదరాబాద్ – మొయినాబాద్ ప్రాంతంలోని ఓక్స్ ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని అనుమానంతో దాడి చేసిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు
ఫామ్… pic.twitter.com/kgPwMeovmf
రాజేంద్రనగర్ SOT పోలీసులు 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పూర్తిగా ఫాంహౌస్ తనిఖీ చేసి పార్టీలో భారీగా డ్రగ్స్, గంజాయి, మద్యం స్వాధీనం చేస్తున్నారు. ఈ ఘటనపై ఫామ్ హౌస్ యజమానితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న ఇంటర్ విద్యార్ధులను విచారిస్తున్నారు.
ఫామ్‌హౌస్‌లో మైనర్ల గంజాయి, మద్యం పార్టీ కలకలం
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 6, 2025
మొయినాబాద్‌లోని చెర్రీ వోక్సో ఫామ్ హౌస్‌లో పార్టీ
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న 50 మంది మైనర్లు
పార్టీ ప్రారంభమైన కాసేపటికే SOT పోలీసుల దాడులు
పట్టుబడ్డ వారిలో 13 మంది మైనర్ బాలికలు
ఫామ్ హౌస్ యజమాని సహా మరో… pic.twitter.com/8Fhy5HLHKq
హైదరాబాద్‌కు చెందిన ఓ డీజే ‘ట్రాప్ హౌస్.9ఎంఎం’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఇ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో యాక్టివ్‌గాఉండే మైనర్ల టార్గెట్ చేశాడు. ఆ డీజే మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పేరుతో పార్టీ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశాడు. ఇది సాధారణ పార్టీ కాదని, ఇందులో హద్దులు లేని ఎంజాయ్‌మెంట్ సరదా ఉంటుందని మైనర్లను ఆకర్షించాడు. ఈ పార్టీకి పాస్‌లు తప్పనిసరి అనే కండీషన్ పెట్టాడు. పార్టీకి ఒక్కరు హాజరుకావాలంటే రూ.1,600 పాస్, జంటగా వస్తే రూ.2,800గా పాస్ ధర నిర్ణయించాడు.
ఇన్‌స్టాలో ఈ ప్రకటనను చూసిన మైనర్లు పార్టీకి ఉత్సాహంగా సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 50 మంది మైనర్లు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీని ఆ డీజే ఏర్పాటు చేశాడు.