/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t150833-699-2025-11-07-15-08-53.jpg)
Police arrest gang selling hash oil
Hyderabad: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మత్తు పదార్థాల విక్రయం ఆగడం లేదు. తాజాగా మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఘరానా ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సోనియా అనే మహిళ అక్కడి నుంచి హైదరాబాద్‌కు హ్యాష్ ఆయిల్‌ను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్ఓటీ టీం, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠాలో ఒరిస్సాకు చెందిన సోనియా ప్రధాన సూత్రధారిగా తేల్చారు.
సోనియాతో పాటు ఆమెకు సహాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గ అనే ముగ్గుర వ్యక్తులను సైతం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుపడ్డ వారి నుండి రూ.3 లక్షల విలువ చేసే 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మాదాపూర్ ఎస్ఓటీ టీం కేసును మియాపూర్ పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం చేస్తున్న జాన్‌పాల్ అనే డాక్టర్​ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని అవసరమైన వారికి దాన్ని సరఫరా చేయడం చేస్తున్నట్లు గుర్తించారు. కాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో డాక్టర్ తన స్నేహితులు పెట్టుబడితో డ్రగ్స్ తెప్పిస్తూ దాన్ని అమ్మగా వచ్చిన డబ్బును స్నేహితులకు ఇస్తూ, తాను డ్రగ్స్​ను ఉచితంగా వినియోగించుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి గుట్టు రట్టుచేశారు. నిందితుడి నుంచి రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు
Follow Us