AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

New Update
FotoJet (2)

AP CRIME: తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు. యువతులు సైతం మోస పోయామని తెలిశాక ఆత్మహత్యలకు పాల్పడం లేదా తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను అంతం చేయడం వంటి చర్యలకు పాల్పడేలా నేర ప్రవృత్తి పెరిగింది. అలాంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. కూతురు డ్రగ్స్‌కు బానిస కావడంతో మనస్థాపం చెందిన తల్లి ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం బయటకు వచ్చింది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ఓ బాలిక(17) స్థానిక  కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఆమె సీనియర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అది నమ్మిన ఆమె అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. దాన్ని ఆసరగా చేసుకుని ఆమెకు ఆ ప్రబుద్ధుడు  డ్రగ్స్‌ అలవాటు చేశాడు.. తన గదికి రప్పించి మత్తుపదార్థాలు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. మత్తులో ఉన్న సమయంలో ఆమెపై అసభ్యకర చర్యలకు పాల్పడుతూ వీడియోలు, ఫొటోలు తీయిస్తు్న్నాడు. 

 సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో ఆ బాలిక తల్లి హైదరాబాద్‌లోని ఒక టీవీ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కాగా తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్‌ చదువుతూ డ్రగ్స్‌కు బానిసైంది. రెండురోజుల క్రితం ఆమె ఫోన్‌ పరిశీలించగా.. అందులో ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కనిపించాయి. దీంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయాన్ని  ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే బాలిక దాడి చేయడంతో తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స నిమిత్తం ఆమెను జీజీహెచ్‌లో చేర్చారు. విషయం తెలుసుకున్న ఈగల్‌ విభాగ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ జీజీహెచ్‌లో ఆమెను పరామర్శించారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఐజీ ఆకే రవికృష్ణ చెప్పారు.  సోషల్‌ మీడియా ద్వారా మైనర్‌ విద్యార్థినిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్‌కు బానిసైన బాలికకు ఆడిక్షన్‌ సెంటర్‌ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. 

అతను..  విద్యార్థి సంఘ నాయకుడు

కాగా ఎస్పీ ఆదేశాలతో తూర్పు డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ ఆధ్వర్యంలో లాలాపేట సీఐ శివప్రసాద్‌ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలికకు డ్రగ్స్‌ అలవాటు చేసిన యువకుడు ఓ రాజకీయపార్టీ విద్యార్థిసంఘ నాయకుడిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలిక అతడిని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేయడానికి నిర్ణయించారని, అది ఇష్టం లేక ఆమె కుటుంబసభ్యులతో గొడవ పడుతోందని, ఈ క్రమంలో ఫోన్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలు చూసి తల్లి నిద్రమాత్రలు మింగారని పోలీసులు తెలుసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు