Delhi: దేశ రాజధానిని మళ్ళీ చుట్టుముట్టిన వాయు కాలుష్యం..
దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు.
దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు.
దీపావళి వస్తోందంటే చాలు పాపం ఢిల్లీ విషాదంలో నిండిపోతుంది. పండుగ చేసుకునే అవకాశం లేక ఢిల్లీ వాసులు మొర్రో అని ఏడుస్తారు. కానీ ఈ సారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలను చేపట్టింది.
ఢిల్లీలో దినేష్ అనే వ్యక్తిపై అతని భార్య అత్యంత కిరాతకంగా దాడి చేసింది. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ను ఆసుపత్రికి తరలించారు.
బిహార్లోని ఢిల్లీ-కోల్కతా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 4 రోజుల నుంచి ఎన్నో వాహనాలు ట్రాఫిక్ జామ్లోనే చిక్కుకునిపోయాయి. కేవలం 5కిలో మీటర్లు మాత్రమే వాహనాలు కదిలాయి.
తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకం కింద అవార్డు అందుకున్నారు.
పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్(PHC)లో వారి దేశానికి చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం భారతీయులను నియామకం చేసుకుంటున్నట్లు బయటపడింది.
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. అతని ఆశ్రమంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలతో పాటూ ప్రముఖులతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5, 6 తేదీలలో న్యూఢిల్లీకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.