Pakistan: బయటపడ్డ పాకిస్థాన్‌ దొంగబుద్ధి.. ఢిల్లీలో పాక్‌ ISI నియామకాలు

పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్‌(PHC)లో వారి దేశానికి చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం భారతీయులను నియామకం చేసుకుంటున్నట్లు బయటపడింది.

New Update
Pakistan High Commission Visa Desk In Delhi Misused As ISI Recruitment Hub

Pakistan High Commission Visa Desk In Delhi Misused As ISI Recruitment Hub

పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్‌(PHC)లో వారి దేశానికి చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం భారతీయులను నియామకం చేసుకుంటున్నట్లు బయటపడింది సెప్టెంబర్ 30న హర్యానాలోని పల్వాల్‌కు చెందిన వాసీమ్ అక్రమ్ అనే సివిల్‌ ఇంజినీర్‌ను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పీహెచ్‌సీ అధికారి అయిన జాఫర్ అలియస్ ముజామ్మిల్ హుస్సైన్‌కు ఈ వాసీమ్ అక్రమ్ కోరియర్‌గా, డేటా సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నాడు. 

Also Read:  పరువు తీశారు.. సింగపూర్ హోటల్లో సెక్స్ వర్కర్లను దోచుకున్న ఇండియన్ టూరిస్టులు!

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022లో వాసీమ్ అక్రమ్‌కు సంబంధించి వీసా ప్రక్రియ కొనసాగుతుండగా అతడిని రిక్రూట్ చేసుకున్నారు. ముందుగా అతడికి పాక్ వీసాను తిరస్కరించారు. ఆ తర్వాత రూ.20 వేలు లంచం ఇచ్చాక వీసా వచ్చింది. అనంతరం పీహెచ్‌సీ అధికారి వాసీమ్‌ను గూఢచర్యం కోసం నియమించుకున్నారు. అతడి బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.45 లక్షలు పంపించారు. వాసీమ్ పాకిస్థాన్‌లోని కాసూర్ నుంచి తిరిగివచ్చాక పీహెచ్‌సీ అధికారి జాఫర్‌తో వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యాడు. భారత ఆర్మీ సిబ్బందికి సంబంధించిన సిమ్‌ కార్డులు, ఓటీపీలు, ఇతర సమాచారాన్ని జాఫర్‌కు పంపించేవాడు. 

Also Read: దేశం విడిచి వెళ్లిపోతే భారీగా డబ్బులు.. వలసదారులకు ట్రంప్‌ బంపర్ ఆఫర్

గతంలో కూడా పీహెచ్‌సీ సిబ్బంది డానిష్ కూడా ఇలాంటి నిఘా చర్యలకు పాల్పడేవాడు. గూఢచర్యం చేసేవారికి డబ్బులు పంపించేందుకు యూపీఐ సేవలు వాడుకోవడం, సమాచారం అందించేందుకు వాట్సాప్‌ను వినియోగించడం లాంటివి చేసేవాడు. చివరికి భారత ప్రభుత్వం డానిష్, జాఫర్ లాంటి పీహెచ్‌సీ సిబ్బందిని పర్సనా నాన్‌ గ్రాటా (ఆమోదయోగ్యం కాని వ్యక్తి)గా ప్రకటించి, బహిష్కరించింది. అయినప్పటికీ పీచ్‌సీలో ఉన్న కొత్త సిబ్బంది కూడా ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ 30న వాసీమ్ అక్రమ్‌ను అరెస్టు చేయడంతో పాక్ గుట్టు రట్టయ్యింది. ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి వెనుక పీచ్‌సీ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. అయితే పాకిస్థాన్‌కు మనదేశంలో ఉండి వాళ్లకు గూఢచారులుగా పనిచేస్తున్నవాళ్లే ఈ సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లని ఈ పాకిస్థాన్ హై కమిషన్ (PHC) ద్వారానే నియమించుకుని ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు.  

Also Read: నీరవ్‌ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌కు అప్పగింత

Advertisment
తాజా కథనాలు