Putin: భారత్‌లో పుతిన్‌ పర్యటన ఖరారు.. రష్యా అధ్యక్షుడి రాకకు ఓ ప్రత్యేకత!

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 5, 6 తేదీలలో న్యూఢిల్లీకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

New Update
PM Modi, Vladimir Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(vladimir-putin) భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 5, 6 తేదీలలో న్యూఢిల్లీకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రక్షణ, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు, మిగిలిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరాపై చర్చలు జరగవచ్చని అంచనా.

Also Read :  అమెరికాలో షట్‌డౌన్‌.. భారత్‌పై ప్రభావం !

Putin To Visit India

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పుతిన్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా టారిఫ్‌లు (సుంకాలు) విధించిన తరుణంలో ఈ సమావేశం జరగనుంది. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల బంధం ఎంత బలంగా ఉందో అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. రష్యా నుంచి ఎస్-57 ఐదో తరం ఫైటర్ జెట్‌లను భారత్‌కు విక్రయించే ప్రతిపాదన కూడా చర్చకు రానుందని తెలుస్తోంది. పుతిన్ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయనుందని విదేశాంగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read :  POKలో 8 మంది పాక్ పౌరులు మృతి.. బరితెగించిన పాకిస్తాన్ ఆర్మీ

Advertisment
తాజా కథనాలు