Telangana : తెలంగాణ విద్యార్థికి రాష్టపతి అవార్డ్.. సేవా రంగంలో అరుదైన అవకాశం

తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతూ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకం కింద అవార్డు అందుకున్నారు.

New Update
President's Award for Telangana student

President's Award for Telangana student

తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి(Engineering Student)కి అరుదైన అవకాశం దక్కింది. జాతీయ సేవా పథకంలో తనదైన ప్రతిభ కనపరిచిన విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(CMR College) లో చదువుతూ జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న  వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకం కింద అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీ(delhi) లోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ఒక  కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 2022-23 సంవత్సరానికి గాను ఆయన  ‘మై భారత్‌-నేషనల్‌ సర్వీస్‌ స్కీం (ఎన్‌ఎస్‌ఎస్‌)’ అవార్డు అందుకున్నారు.  

Also Read :  రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు..

President's Award For Telangana Student

మణిసాయివర్మ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(CMR Engineering College) లో చదువుతూ ఎన్‌ఎస్‌ఎస్‌(NSS) లో పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి జీవన్‌బీమా యోజన, స్వచ్ఛభారత్, క్యాష్‌లెస్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా తదితర విభిన్న పథకాలపై సాయి  విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తద్వారా  గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక ఇప్పటి వరకు 504 మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటు పడ్డారు.  మరోవైపు వ్యక్తిగతంగా రెండు యూనిట్ల వరకు రక్తదానం కూడా చేశారు. 40 కి పైగా ఆరోగ్య, టీకా శిబిరాలలో  పాల్గొని ప్రజలకు సేవలందించారు. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించిన ఎన్‌ఎస్‌ఎస్‌ మణిసాయివర్మను రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేసింది. కాగా అవార్డుకుగాను  మణిసాయివర్మకు రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

Also Read: ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు

Advertisment
తాజా కథనాలు