Delhi : నాశనమైపోతార్రా.. టూత్‌పేస్ట్, ఈనో కూడా కల్తీనేనా.. మీ ముఖాలు మండ!

ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ ఆహార, వినియోగ వస్తువులను తయారు చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఢిల్లీ పోలీసులు, ఆహార భద్రత అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో బట్టబయలు చేశారు.

New Update
fake eno

ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ ఆహార, వినియోగ వస్తువులను తయారు చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఢిల్లీ పోలీసులు, ఆహార భద్రత అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో బట్టబయలు చేశారు. నిత్యం మనం ఉపయోగించే టూత్‌పేస్ట్‌(toothpastes) తో పాటు, కడుపు సమస్యలకు వాడే ప్రసిద్ధ బ్రాండ్ ఈనో(ENO)  పౌడర్‌ను ఇక్కడ కల్తీ చేసి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని గుట్టు ప్రదేశంలో ఈ అక్రమ ఫ్యాక్టరీ నడుస్తోంది.

Also Read :  మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు నేత రూపేష్ లొంగుబాటు

ఈనో పౌడర్‌ను కూడా కల్తీ చేసి

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ టూత్‌పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. దీని తయారీకి తక్కువ నాణ్యత గల, హానికరమైన రసాయనాలను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కడుపులో మంట, ఎసిడిటీకి ఉపయోగించే ఈనో పౌడర్‌ను కూడా కల్తీ చేసి, ప్యాక్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో కల్తీ సరుకులు, వాటి తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ యంత్రాలు, ప్రసిద్ధ బ్రాండ్‌ల నకిలీ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేశారు. ఫ్యాక్టరీ యజమానితో పాటు అందులో పనిచేస్తున్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ అంతటా పనిచేస్తున్న నకిలీ ఉత్పత్తుల తయారీ యూనిట్లపై ముమ్మరం చేసిన దాడుల్లో భాగంగా ఈ ఫ్యాక్టరీని ఛేదించడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు