Delhi: దేశ రాజధానిని మళ్ళీ చుట్టుముట్టిన వాయు కాలుష్యం..

దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు. 

New Update
AIR Pollution in delhi

దీపావళి వస్తోందంటే చాలు ఢిల్లీ వాసుల్లో గుబులు మొదలవుతుంది. తమ ప్రాంతాన్ని చుట్టుముట్టే వాయు కాలుష్యానికి అక్కడి ప్రజలు భయపడతారు. అక్టోబర్ లో మొదలై..శీతాకాలం అయ్యే వరకు ఉండే ఈ బాధ...ప్రతీ ఏడాదీ ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం దేశ రాజధానిలో ఈ పరిస్తితి మొదలైపోయింది. అ్కడ గాలి నాణ్యత సూచీ 211కు పడిపోయింది. దీంతో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ GRAP స్టేజ్-1 ఆంక్షలను  అమలు చేసింది. నిర్మాణ పనులు, వ్యర్థాల దహనం, వాహన కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  యాంటీ-స్మాగ్ గన్‌ల వినియోగం..చెత్త, ఇతర వ్యర్థాలకు బహిరంగంగా నిప్పుపెట్టడంపై నిషేధం లాంటివి అమలు చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే ఫుడ్‌స్టాల్స్‌, కమర్షియల్‌ కిచెన్‌లలో బొగ్గు, కలప మండించడంపై నిషేధం విధించారు. అన్ని చోట్ల విద్యుత్ లేదా గ్యాస్ వంటి కాలుష్య రహిత ఇంధనాలే వాడాలని ఆంక్షలు పెట్టారు. అత్యవసరం అయితేనే డీజిల్ జనరేటర్లను వాడాలి. దీంతో పాటూ కాలుష్యానికి కారణమయ్యే వాహనాలకు జరిమానా విధించనున్నారు.పదేళ్లుపైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలపై నిషేధం అలు చేస్తున్నారు. 

డేంజర్ శీతాకాలం..

శీతాకాలం వస్తోందంటే ఢిల్లీలో గాల కలుఫితం అయిపోతుంది. అత్యంత ప్రమాదకర స్థాయిన చేరుకుని విషంగా మారిపోతుంది. దీని నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా తీవ్ర మాత్రం తగ్గదు. ఇప్పుడు అక్టోబర్ వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో శీతాకాలం మొదలైపోతుంది. ఢిల్లీలో దపావళికి ముందే వాయు కాలుష్యం మొదలౌతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది దేశ రాజధాని. అక్కడ ‘వాయు నాణ్యత సూచీ’ మంగళవారం 211గా నమోదైంది. ఇది ‘పూర్‌’ కేటగిరిలోకి వస్తుంది. అందుకే తక్షణ చర్యలను మొదలుపట్టారు. ఇది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Also Read: US-China Trade War: అక్కడ కూడా వాణిజ్య యుద్ధం..వదల బొమ్మాళీ వదల అంటున్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు