Delhi Baba: ఛీ ఛీ..ఆశ్రమం నిండా అవే...పోలీసులకు ఊహించని వస్తువులు లభ్యం

లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. అతని ఆశ్రమంలో అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలతో పాటూ ప్రముఖులతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫోటోలు లభ్యమైనట్లు తెలుస్తోంది. 

New Update
Delhi Baba

ఢిల్లీలో ఓ కాలేజీలో నిర్వహణ కమిటీలో సభ్యుడిగి ఉన్న స్వామి చైతన్యానంద లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతను పని చేస్తున్న కాలేజీ విద్యార్థినుల నుంచే ఫిర్యాదు వెళ్ళి కేసు నమోదు అయింది. ఈ క్రమంలో ఢిల్లీ బాబాపై కేసు నమోదు అయింది. ఆరోపణల తర్వాత తప్పించుకుని తిరుగుతున్న చైతన్యానందను పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అతని ఫోన్ వాట్సాప్ ను చెక్ చేశారు. ఢిల్లీ బాబా చాటింగ్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా, వారిని విదేశీయులకు పంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన చైతన్యానంద వాట్సాప్ చాట్స్‌లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒక దుబాయ్ షేక్‌కు సెక్స్ భాగస్వామి కావాలి, నీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారా?" అని బాబా ఓ విద్యార్థినిని అడిగినట్లు ఉంది. దానికి ఆ విద్యార్థిని "ఎవరూ లేరు" అని చెప్పింది. బాబా "అదెలా సాధ్యం? నీ క్లాస్‌మేట్స్, జూనియర్స్ ఎవరైనా?" ఉంటే చెప్పు అని పదేపదే ఆ చాట్‌లో అడిగాడు.

ఆశ్రమం నిండా అవే..

దీని తరువాత పోలీసులు చైతన్యానంత ఆశ్రమంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా పోలీసులకు ఊహించని వస్తువులు లభ్యమయ్యాయి. శృంగారానికి సంబంధించిన ఫోటోలు...వాటికే చెందిన సీడీలు దొరికాయి. దాంతో పాటూ దొంగ బాబా... ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బ్రిటన్‌ నేతలతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫొటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కాలేజీలో మహిళా సిబ్బంది ఫొటోలు తీయడం, విద్యార్థినులతో అసభ్యంగా చాట్‌ చేయడం, వారి కదలికలను సీసీ కెమెరా యాప్‌ ద్వారా పర్యవేక్షించడం లాంటివి కూడా చేసినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయని తెలుస్తోంది. 

ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న చైతన్యానంద విచారణలో వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని..తప్పు అంత ఈజీగా ఒప్పుకునే రకంగా కాదని పోలీసులు చెబుతున్నారు.  దుబాయ్ షేక్ వ్యవహారంలో ఎవరి గురించి అతను అడిగాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Also Read :  సీఎం మార్పుపై సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

Advertisment
తాజా కథనాలు