500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటన
పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది.