Delhi: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఈసీ రాజీవ్ కుమార్.. ఎన్నికల తేదీలు, షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన పదవీ విరమణ గురించి కూడా ఆయన తాజాగా స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పదవీ కాలం పూర్తి కానున్నట్లు చెప్పారు. Also Read: USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్ కొన్ని నెలల పాటు.. అయితే పదవి విరమణ తర్వాత ఏవైనా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. తాను ఈ పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు హిమాలయాలకు వెళ్లి అక్కడే ఉంటానని చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు.ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. ఫిబ్రవరి 18వ తేదీన తాను పదవీ విరమణ చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్ గేర్ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి? రిటైర్మెంట్ తర్వాతహిమాలయాలకు వెళ్లి తాను డీటాక్సీఫై అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు కొంచెం ఏకాంత సమయం కావాలన్నారు. అందుకోసం అందరికీ దూరంగా వెళ్తానని చెప్పారు. హిమాలయాల్లో సుదూర ప్రాంతానికి వెళ్లి అక్కడే 4, 5 నెలల పాటు అక్కడే ఉంటానని పేర్కొన్నారు. అనవసర అంశాల నుంచి పూర్తి విముక్తి పొందుతానని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో రాజీవ్ చెప్పారు. తాను ఒక మున్సిపల్ స్కూల్లో చదువుకున్నానని వివరించారు. చిన్నతనంలో తాను చెట్టు కింద విద్యా బోధనలు విన్న రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక తాను ఏ, బీ, సీ, డీలను ఆయన ఆరో తరగతిలో నేర్చుకున్నట్లు చెప్పారు. అందుకే అణగారిన వర్గాల చిన్నారులకు బోధించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు. Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! Also Read: Canada: కెనడా నెక్ట్స్ పీఎం ఎవరు..రేసులో భారత సంతతి ఎంపీ కూడా!