ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ.. తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా.. మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మను బరిలోకి దింపింది. దీంతో నియోజకవర్గంలో కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ పోరుపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!
పర్వేశ్‌వర్మ ఎవరు ?
పర్వేశ్‌వర్మ పూర్తి పేరు పర్మేశ్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. 2014, 2019లో పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థిపై ఏకంగా రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో లోక్‌సభ అభ్యర్థి ఇంత భారీ మెజార్టీతో గెలవడం అదే మొదటిసారి. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకే పర్వేశ్ సింగ్ వర్మ. కేజ్రీవాల్‌కు పోటీగా బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో న్యూఢిల్లీ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపింది.
Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?
మరోవైపు ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ మరో మాజీ ఎంపీ రమేశ్ బిధూడీని బరిలోకి దింపింది. ఈయన కూడా సీనియర్ నేత. వృత్తిరిత్యా న్యాయవాది కూడా. రమేశ్ బిధూడీ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసిన ఈయన.. ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించారు. బీజేపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బిదూరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అతిషిపై పోటీ చేయడంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అతిషికి పోటీగా అల్కా లాంబా పోటీ చేయనున్నారు.