ఈ మధ్య కాలంలో భార్యల వేధింపులు భరించలేక భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. భార్య వేధింపులు భరించలేక ఇటీవల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి ముఖర్జీ నగర్‌లో న్యాయవాది సమీర్ మెహెందిర్తా కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య వేధింపులు భరించలేక విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.దీంతో విడాకుల కోసం ఆమెతో చర్చించారు. ఈ క్రమంలోనే ఇద్దరికి పెద్ద గొడవ అయ్యింది. ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! #WATCH | Delhi | Outside visuals from the residence of a 45-year-old advocate, identified as Sameer Mendiratta, who died allegedly by suicide in Mukherjee Nagar, on Tuesday evening. pic.twitter.com/3mTQkdlMTc — ANI (@ANI) January 8, 2025 ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ విడాకులు కోసం గొడవ జరగ్గా.. విడాకుల కోసం చర్చించిన తర్వాత.. తుపాకీతో కాల్చుకుని సమీర్ మెహెందిర్తా ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయవాదిగా ఉన్న ముఖర్జీ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అతుల్ సుభాష్‌తో పాటు ఇటీవల మరో కొందరు కూడా భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కూడా వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!