ఉదయం ఎనిమిది, తొమ్మిది అవుతున్నా ఢిల్లీలో మాత్రం తెల్లారడం లేదు. వెలుతురుగా ఉన్నా ఎదుట మనిషి కనిపించడం లేదు. దీనికి కారణం విపరీతమైన పొగమంచు. ఢిల్లీలో ఎప్పుడూ చాలా చలిగా ఉంటుంది. ఈ ఏడాది కూడ ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. సూర్యుడు వస్తున్నప్పటికీ రోజంతా చలిగానే ఉంటోంది. దానికి తోడు ఉదయాల్లో పొగమంచు వల్ల ఏమీ కనిపించడం లేదు.
విమానాలు ఆలస్యం..
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఈరోజు ఆరు విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున 20 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక నిన్న 48 విమానాలు రద్దు అయ్యాయి. 564 ఫ్లైట్స్ లేట్ అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలో జీరో విజిబిలిటీ ఉండడమే దీనికి కారణం అని చెబుతున్నారు. అయితే నిన్నటి కంటే ఈరోజు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. విజిబిలిటీ కాస్త బెటర్‌గా ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దీనికి తోడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది.
మరో పక్క రైళ్ళు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా ఢిల్లీ వెళ్లే దాదాపు 50 కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కర్నాల్ గాజియాబాద్ ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి కంటిన్యూ అవుతోంది. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 8 వ తేదీ వరకు దేశ రాజధానిలో పొగ మంచు ఇలానే ఉండే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
Also Read: కొత్త వైరస్‌పై అప్డేట్స్ కావాలి..డబ్ల్యూహెచ్‌వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి