Delhi: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

వచ్చే రెండు రోజులు ఢిల్లీలో చలి పెరగడంతో పాటు వర్షాలు కూడా కురవనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 9, 10వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
rains

Yellow Alert To Delhi

ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో చలి విపరీతంగా ఉంది. అయితే వచ్చే రెండు రోజులు ఢిల్లీలో చలి పెరగడంతో పాటు వర్షాలు కూడా కురవనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 9, 10వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

భారీ వర్షాలు..

ఈ ఏడాది తొలి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలో ప్రస్తుతం దట్టమైన పొగమంచు కురవడంతో పాటు పగటిపూట భారీగా చలిగాలులు వీస్తున్నాయి. జనవరి 9,10వ తేదీల్లో కంటే జనవరి 11, 12వ తేదీల్లో ఎక్కువగా కురిసే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 6-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

ఇది కూడా చూడండి:  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు